యాడ్స్ తో బీఎస్ఎన్ఎల్ పేమెంట్స్!!

SMTV Desk 2019-05-01 13:39:38  bsnl, bsnl app, bsnl app ads, bsnl recharges

ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్ కొత్త కొత్త ప్లాన్లు తమ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తుంది. తాజాగా బీఎస్ఎన్ఎల్ యాప్‌లో మరో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. యూజర్లు దీని ద్వారా యాడ్స్ (ప్రకటనలు) చూస్తే రివార్డ్స్ పాయింట్లు గెలుచుకోవచ్చు. బీఎస్ఎన్ఎల్ ఇటీవలే తన మై బీఎస్ఎన్ఎల్ యాప్‌ను అప్‌డేట్ చేసింది. చాలా ఫీచర్లను జత చేసింది. యూజర్లకు యాప్‌ను మరింత చేరువ చేయడం, వారికి ప్రయోజనం కల్పించడమే ఈ ఫీచర్ల అసలు ఉద్దేశం. ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అప్‌డేటెడ్ వెర్షన్ యాప్ అందుబాటులో ఉంది. ఐఓఎస్ వెర్షన్ ఇంకా అప్‌డేట్ కాలేదు. మై బీఎస్ఎన్ఎల్ యాప్‌లో దాదాపు 18 కేటగిరిలకు చెందిన యాడ్స్‌ను వీక్షించొచ్చు. పాయింట్లను గెలుచుకోవచ్చు. వీటి ద్వారా బీఎస్ఎన్ఎల్ భాగస్వామ్య యాప్స్/సెట్స్‌లో షాపింగ్ చేయవచ్చు. లేదంటే ఆ పాయింట్లను క్యాష్ రూపంలోకి మార్చుకోవచ్చు. డిజిటల్ వాలెట్లలోకి డిపాజిట్ చేసుకోవచ్చు. యాప్ ద్వారా యుటిలిటీ బిల్లులను చూడా చెల్లించొచ్చు. మొబైల్ ఫోన్లను రీచార్జ్ చేసుకోవచ్చు. బీఎస్ఎన్ఎల్ సహా ఇతర కంపెనీల పోస్ట్ పెయిడ్ బిల్లు కట్టొచ్చు. అలాగే యాప్ ద్వారా వైఫై సేవలు పొందొచ్చు. ఫ్యాన్సీ నెంబర్లను కొనుగోలు చేయవచ్చు. ప్రిపెయిడ్ ప్లాన్ వివరాలు, డ్యూ డేట్, డేటా వినియోగం వంటి వివిధ రకాల సేవలు కూడా పొందొచ్చు.