కూతురు దగ్గర రూ. 10 కోట్లు అప్పు చేసిన శత్రుఘ్న సిన్హా

SMTV Desk 2019-05-01 12:41:26  shatrugna sinha, sonakshi sinha, poonam, bihar congress candidate

ముంబై, మే 01: తనకు రూ. 8.60 కోట్ల చరాస్తులు, రూ. 103.61 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. తన భార్య పూనమ్ పేరుపై రూ. 18.67 కోట్ల చరాస్తులు, రూ. 62.65 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయని తెలిపారు. రూ. 2.74 కోట్ల మేర ఫిక్స్ డ్ డిపాజిట్లు, రూ. 29.10 లక్షల పెట్టుబడులు ఉన్నాయని చెప్పారు.

రూ. 1.03 కోట్ల విలువైన బంగారు, వెండి ఆభరణాలు ఉన్నాయని... తన భార్యకు రూ. 1.15 కోట్ల విలువైన ఆభరణాలు ఉన్నాయని తెలిపారు. తన కుమార్తె సోనాక్షి సిన్హా నుంచి రూ. 10.59 కోట్లు అప్పుగా తీసుకున్నానని చెప్పారు. ఒక అంబాసడర్, రెండు కామ్రీ, ఇన్నోవా, ఫార్చ్యూనర్, మారుతి సియాజ్, స్కార్పియో వాహనాలు ఉన్నాయని వెల్లడించారు. తన భార్యకు మెర్సిడెస్ బెంజ్ కారు ఉందని చెప్పారు. బీహార్ లోని పాట్నాసాహిబ్ నుంచి శత్రుఘ్న సిన్హా పోటీ చేస్తున్నారు.