అమెరికాలో మరోసారి కాల్పులు

SMTV Desk 2019-05-01 12:30:08  america, firings

వాషింగ్టన్: మంగళవారం రాత్రి అమెరికాలో మరోసారి కాపులు జరిగాయి. ఈ కాల్పులో ఇద్దరు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ కాల్పుల ఘటన నార్త్‌ కరోలినాలో జరిగిందని పోలీసులు తెలిపారు. మూడు రోజుల క్రితం అమెరికాలో జరిగిన కాల్పుల్లో నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల ఘటన వెనుక ఉగ్రవాద కోణం ఏమైనా ఉందా అన్న అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియరాలేదు.