మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు...నేను గే కాదు!!

SMTV Desk 2019-05-01 12:27:15  James Faulkne, australia cricketer, gay

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా క్రికెటర్ జేమ్స్ ఫాల్కన్ పుట్టిన రోజు సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు అతనికి పెద్ద చిక్కు తెచ్చిపెట్టింది. ఆదివారం తన 29వ పుట్టినరోజు సందర్భంగా ఫాల్కనర్‌ తల్లితో పాటు తన మిత్రుడితో కలిసి రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఫాల్క్‌నర్.. దాని కింద బాయ్‌ఫ్రెండ్‌తో పుట్టినరోజు డిన్నర్‌అని రాసుకొచ్చాడు. అంతేకాకుండా ఐదేండ్లుగా కలిసి ఉంటున్నాం అనే అర్థం వచ్చే హ్యాష్‌ట్యాగ్‌ను జతచేశాడు. అంతే ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు, మీడియా అనేక కథనాలు రాసుకొచ్చింది. ఫాల్కనర్‌ తన తల్లికి అతను స్వలింగ సంపర్కుడిన(గే)ని, అలాగే తన బాయ్‌ఫ్రెండ్‌ రాబర్ట్ జబ్‌తో గత ఐదేళ్లుగా సహజీవనం చేస్తున్నట్లు తెలిపాడు. ఈ సందర్భంగా బాయ్‌ఫ్రెండ్‌తో బర్త్‌డే డిన్నర్ అంటూ రాబర్ట్‌తో కలిసున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఈ ఫోటోలో ఫాల్కనర్ తల్లి కూడా ఉన్నారు. అని మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో బెంబేలెత్తిపోయిన ఫాల్క్‌నర్ అయ్యా బాబూ మీరంత తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను గేను కాదు. అంటే ఎల్జీబీటీ కమ్యూనిటిని తక్కువ చేసి మాట్లాడటం కాదు కానీ. అతడు నా సన్నిహితుడు.వ్యాపార భాగస్వామి. గత ఐదేండ్లుగా మేము కలిసి ఉంటున్నాం అని వివరణ ఇచ్చుకున్నాడు. పుట్టిన రోజు సందర్భంగా నేను చేసిన పోస్ట్‌ను చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను గేను కాదు. రోబ్‌జుబ్‌స్తా (ఫొటోలో ఉన్న స్నేహితుడు) నాకు మంచి మిత్రుడు. గత కొన్నేండ్లుగా మేము ఒకే ఇంట్లో ఉంటున్నాంఅని మంగళవారం మరో పోస్ట్ పెట్టాడు. పనిలోపనిగా ఎల్జీబీటీ కమ్యూనిటి నుంచి కూడా విమర్శలు రాకూడదనే చందంగా వివరణ ఇచ్చాడు. ఈ అంశంపై అత్యుత్సహంతో ముందే స్పందించిన క్రికెట్ ఆస్ట్రేలియా నాలుక్కరుచుకుంది. తప్పు తెలుసుకొని ఫాల్క్‌నర్‌కు క్షమాపణలు చెప్పింది. కాగా, ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ స్టీవెన్ డేవీస్ 2011లో తొలిసారి గేనని బహిరంగంగా ప్రకటించుకున్నాడు.