నీరజ్ చోప్రాకు ఖేల్ రత్న

SMTV Desk 2019-05-01 12:26:04  khel ratna award 2019, neeraj chopra, indian athletic player

న్యూఢిల్లీ: క్రీడారంగ అత్యున్నత పురష్కారం రాజీవ్‌గాంధీ ఖేల్ రత్న అవార్డు 2019 కోసం భారత అథ్లెటిక్స్ సమాఖ్య(ఏఎఫ్‌ఐ) స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా పేరును మంగళవారం ప్రతిపాదించింది. గతేడాది జరిగిన ఆసియా క్రీడల్లో జావెలిన్‌ను రికార్డు దూరం(88.06మీ) విసిరి చోప్రా పసిడి పతకాన్ని ముద్దాడిన సంగతి తెలిసిందే. కామన్వెల్త్ క్రీడల్లోనూ నీరజ్ అద్భుత ప్రదర్శనతో స్వర్ణంతో సత్తాచాటాడు. ఇలా బరిలోకి దిగిన ప్రతి టోర్నీలో పతకంతో మెరుస్తున్న నీరజ్ పేరును గతేడాది ఖేల్త్న్ర అవార్డు కోసం సిఫారసు చేసినప్పటికీ అర్జున అవార్డుతో సరిపుచ్చారు. ఈ ఏడాది కూడా ఖేల్త్న్ర అవార్డు కోసం నీరజ్‌పేరును ప్రతిపాదిస్తున్నామని ఏఎఫ్‌ఐ అత్యున్నత వర్గాలు పేర్కొన్నాయి. పతకాలతో మెరిసిన తేజిందర్‌పాల్‌సింగ్, అర్పిందర్‌సింగ్, మన్‌జీత్‌సింగ్, స్వప్నబర్మన్, ద్యుతీ చంద్ పేర్లను అర్జున అవార్డు కోసం ఏఎఫ్‌ఐ సిఫారసు చేసింది.