జెర్సీ సినిమా అద్భుతం .. దేవసేన

SMTV Desk 2019-05-01 12:14:51  jersey, Anushka,

జెర్సీ సినిమా ఇంకా థియేటర్స్ లో సందడి చేస్తుంది.. టాలీవుడ్ ప్రముఖులు ఈ చిత్రం ని తమ పొగడ్తలతో ముంచెత్తారు .. ఇపుడు స్టార్ హీరోయిన్ అనుష్క కూడా ఫిదా ఐంది సినిమాకి .. జెర్సీ సినిమా తనకు అద్భుతమైన అనుభూతినిచ్చిందని అన్నారు. నాని హీరోగా నటించిన ఈ సినిమాను తాజాగా చూసిన ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. జెర్సీ ... సినిమాలోని మ్యాచ్‌ చూసిన తర్వాత తాను పొందిన ఫీలింగ్ మాటల్లో చెప్పలేనిదని తెలిపారు. నిజంగా ఇది నాకు ఫ్యాన్‌ మూమెంట్‌ (ఇది కేవలం స్వచ్ఛమైన ప్రేమ). నాని.. తక్కిన సినిమా యూనిట్ కు తన శుభాకాంక్షలు అంటూ వివరించారు. అంతా ఈ సినిమాను మాకిచ్చినందుకు ధన్యవాదాలు అంటూ అనుష్క పోస్ట్‌ లో పేర్కొన్నారు. కాగా జెర్సీ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్ గా నటించగా.. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మించింది. అనిరుధ్‌ బాణీలను అందించిన ఈ సినిమా బాక్సీఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.