గ్రేట్ వాల్ పై ఆంక్షలు విధించిన చైనా ప్రభుత్వం..

SMTV Desk 2017-08-21 18:38:23  great wall of chaina, stones, historical place, chaina governament

చైనా, ఆగస్ట్ 21 : ప్రపంచంలో కెల్లా ఏడు వింతల్లో ఒకటైన చైనా వాల్స్ పై కొందరు పర్యాటకులు జ్ఞాపకం కోసమంటూ చిన్న చిన్న రాళ్ళను పెకిలించి తమ దేశాలకు తీసుకెళుతున్నారు. అంతేకాకుండా ఆ వాల్స్ పై ఏవేవో పేర్లు రాస్తున్నారు. దీన్ని అరికట్టడానికి 300కు పైగా హై డెఫినిష‌న్ కెమెరాల‌ను వాల్ పొడవున అమర్చారు. ప్రపంచ వింతల్లోనే ఇది ఒక గొప్ప చారిత్రాత్మక కట్టడం కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొరియ‌న్‌, చైనీస్‌, ఇంగ్లిషు పేర్లు గ్రేట్ వాల్ పొడవున ఉండడం చైనా పురాతన కట్టడ బృందం గమనించింది. ఇలాంటి సంఘటనలు జరగకుండా చైనా కెమెరాలను ఏర్పాటు చేసింది. ఒకవేళ ఎవరైనా పర్యాటకులు గోడలమీద గీతలు గీస్తూ కనిపిస్తే వారిని మళ్ళీ చైనా రాకుండా నిషేదించాల౦టూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా అక్కడక్కడ హెచ్చరిక బోర్డులను అమర్చారు.