రోడ్లపై మానవ అంగాల పెయింటింగ్ లతో నిరసనలు

SMTV Desk 2019-04-30 19:21:31  penis paintings on road in england, government

ఇంగ్లాండ్: ఇంగ్లాండ్ లో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వాధికారుల కళ్ళు తెరిపించడానికి ఓ వ్యక్తి సాదాసీధాగా కాకుండా విభిన్నంగా నిరసన చేశాడు. ఇంగ్లాండ్ లోని మిడిల్స్ బర్గ్ కాలనీలో రోడ్డు మీద చిన్న చిన్న గుంతలు పడి రోడ్డంతా గుంతలమయం అయ్యాయని ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా వాళ్లు పట్టించుకునే పాపాన పోవడంలేదు. దీంతో ఆ రోడ్డుపై ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. అయితే ఓ వ్యక్తికి అధికారుల పట్టింపులేని తనం మీద చిర్రెత్తుకొచ్చింది. మూసుకున్న వాళ్ల కళ్లు తెరవాలనుకున్నాడు. తన స్ట్రీట్ పెయింటింగ్ టాలెంట్‌తో…. గుంతలు పడిన చోట పురుషాంగం బొమ్మలు వేశాడు. చూడటానికి చాలా ఇబ్బంది కరంగా ఉన్నా.. అవి అధికారుల కళ్లు తెరిచాయి. వెంటనే రంగంలోకి దిగి గుంతలు కనపడకుండా సరిచేసేసారు. చేసిందంతా చేసి మేము ఇదంతా పురుషాంగాల చిత్రాలను చూసి చేయలేదని.. వాటిని పూడ్చాలని చాలా రోజులుగా అనుకుంటున్నామని బొంకారు అధికారులు. గతంలో కూడా ఇంగ్లాండ్‌లో ఇలాంటి ఘటనలు జరిగాయి. గుంతల వద్ద ఓ వ్యక్తి వేసిన పెయింటింగ్‌లు చూసి వాటిని సరిచేశారు అధికారులు.