బర్త్ డే రోజు తల్లికి షాక్ ఇచ్చిన ఆసిసి క్రికెటర్

SMTV Desk 2019-04-30 19:17:44  James Faulkne, australia cricketer, gay

సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెటర్ జేమ్స్ ఫాల్కన్ పుట్టిన రోజు సందర్భంగా తన తల్లికి సంచలన వార్త బయటపెట్టాడు. ఆదివారం తన 29వ పుట్టినరోజు సందర్భంగా ఫాల్కనర్‌ తల్లికి తాను స్వలింగ సంపర్కుడిన(గే)ని, అలాగే తన బాయ్‌ఫ్రెండ్‌ రాబర్ట్ జబ్‌తో గత ఐదేళ్లుగా సహజీవనం చేస్తున్నట్లు తెలిపాడు. ఈ సందర్భంగా బాయ్‌ఫ్రెండ్‌తో బర్త్‌డే డిన్నర్ అంటూ రాబర్ట్‌తో కలిసున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఈ ఫోటోలో ఫాల్కనర్ తల్లి కూడా ఉన్నారు. ఇక ఆసీస్ తరఫున ఆల్ రౌండర్ గా అదరగొట్టాడు ఫాల్కనర్. బౌలింగ్, బ్యాటింగ్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసే ఫాల్కనర్ ఆసీస్‌ను ఒంటిచెత్తో ఎన్నో మ్యాచ్‌లలో గెలిపించాడు. 2015 ప్రపంచకప్ ఫైనల్ లో అద్భుత ప్రదర్శన చేసిన ఫాల్కనర్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు కూడా అందుకున్నాడు.