చైతు సినిమాలో RX 100 హీరో!

SMTV Desk 2019-04-30 17:49:55  akkineni naga chaithanya, karthikeya reddy, ajay bhoopathi, rx 100

హైదరాబాద్: అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం తొలి సినిమాతోనే సంచలన విజయం సాధించిన దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో నాగచైతన్య పోలీస్ అధికారికగా నటించనున్నారని సమాచారం. ‘మహాసముద్రం’ అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశారని టాక్. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా సమంతను అజయ్ భూపతి సంప్రదించారని, ఆమె తన నిర్ణయం చెప్పాల్సి ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, తాజాగా ఈ సినిమా గురించి మరో ఆసక్తికర వార్త బయటికి వచ్చింది. ‘RX 100’ హీరో కార్తికేయ రెడ్డి కూడా ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషించనున్నట్లు సమాచారం. ఇప్పటికే అజయ్ భూపతి కథను కార్తికేయకు వినిపించారట. కానీ, కార్తికేయ తన నిర్ణయాన్ని వెల్లడించారా లేదా అనే విషయంపై స్పష్టత లేదు. ప్రస్తుతం అజయ్ స్క్రిప్ట్ పని మీద బిజీగా ఉన్నారు. మరికొద్ది రోజుల్లో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం కార్తికేయ హీరోగా ‘హిప్పీ’ సినిమా తెరకెక్కుతోంది. తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కలైపులి యస్.థాను సమర్పణలో వి క్రియేషన్స్, ఏసియన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. టి.ఎన్.కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. దిగంగన సూర్యవంశీ హీరోయిన్‌గా నటిస్తోంది. మరోవైపు, ‘గుణ 369’ అనే సినిమాలోనూ కార్తికేయ హీరోగా నటిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర ఫస్ట్‌లుక్ విడుదలైంది. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. స్పిన్ట్ ఫిలిమ్స్, జ్ఞాపిక ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై తిరుమల్ రెడ్డి, అనిల్ కడియాల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చేతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.