సత్తెనపల్లిలో రెచ్చిపోయిన పేకాటరాయుళ్లు

SMTV Desk 2019-04-30 17:49:13  guntur, sattenapally mandal, rummy players fighting

గుంటూరు: గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి మండలం గోగులపాడులో పేకాటరాయుళ్లు రెచ్చిపోయారు. ఆట వివాదంలో అదుపుతప్పిన ఆటగాళ్ళు రెండు వర్ఘాలు మధ్య చిచ్చు పెట్టారు. కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో ఓ వర్గం పేకాటరాయుళ్లు మరో వర్గం వారికి చెందిన ఇళ్లను ధ్వంసం చేసి దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనల్లో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గొడవ ఎందుకు జరిగింది అనే దానిపై స్పష్టత లేదు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తుంది.