కొత్త జేర్సీలతో బరిలోకి బంగ్లాదేశ్‌

SMTV Desk 2019-04-30 17:45:33  bangladesh cricket, icc world cup 2019, Bangladesh cricket team new jersey

బంగ్లాదేశ్‌: ఇంగ్లాండ్‌ వేదికగా మే 30 న ప్రారంభం కానున్న ఐసిసి వరల్డ్ కప్ కోసం ప్రపంచ దేశాలన్నీ సమరానికి సిద్దమవుతున్నాయి. ఇక ఈ టోర్నీలో బంగ్లాదేశ్‌ కొత్త జెర్సీతో బరిలోకి దిగుతుంది. ఈ జెర్సీ ఆకుపచ్చ రంగులో ఉంది. ప్రపంచకప్‌ లోగో కుడివైపున, బిసిబి లోగో ఎడమ వైపున ఉంది. ఈ కొత్త జెర్సీతోనైనా బంగ్లాదేశ్‌ రాత మారుతుందో లేదో చూడాలి. 1990 నుంచి బంగ్లాదేశ్‌ ప్రపంచకప్‌ వేటలో ఉన్నా ఇప్పటివరకు కప్‌ సాధించలేదు. జూన్‌2న దక్షిణాఫ్రికాతో బంగ్లాదేశ్‌ తొలి మ్యాచ్‌ ఆడనుంది.