మహర్షి లేటెస్ట్ అప్ డేట్: నరేష్ ని పక్కన పెట్టారా?

SMTV Desk 2019-04-30 16:36:38  Maharshi, Allari Naresh,

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న మూవీ మహర్షి. ముగ్గురు బడా నిర్మాతలు నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన అందాల తార పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో మహేష్ ఫ్రెండ్ గా అల్లరి నరేష్ కూడా నటిస్తున్నాడని తెలిసిందే. హీరోగా ఈమధ్య బాగా వెనుకపడ్డ నరేష్ గమ్యం తర్వాత సపోర్టింగ్ రోల్ మహర్షిలోనే చేశాడు.

ఈ సినిమాతో నరేష్ మళ్లీ తన కెరియర్ హిట్ ట్రాక్ ఎక్కించాలని చూస్తున్నాడు. అయితే సినిమా ఎనౌన్స్ మెంట్ టైం లో సినిమాలో నరేష్ ఉంటున్నాడని చెప్పి.. ఆ తర్వాత ఆన్ లొకేషన్ పిక్స్ కూడా సందడి చేశాయి. అంతేతప్ప అల్లరి నరేష్ ను ప్రమోషన్స్ కు అసలు వాడుకోవట్లేదు. ఒకవేళ సినిమాలో అతనే ఇంపార్టెంట్ కావొచ్చు కాని సినిమా ప్రచరా చిత్రాలుగా వచ్చిన పోస్టర్స్, టీజర్స్ లో నరేష్ ఎక్కడ లేడు. కేవలం చోటి చోటి బాతి సాంగ్ లో అల్లరి నరేష్ ఉన్నాడు. మరి నిజంగానే దాచాలని చూస్తున్నారా లేక మహేష్ మేనియా వల్ల తొక్కేస్తున్నారా అంటూ కొందరు డౌట్ పడుతున్నారు. మే 9న రిలీజ్ కాబోతున్న మహర్షి సినిమా మహేష్ 25వ మూవీ అవడం విశేషం.