ఊర మాస్ లుక్‌లో ధనుష్ ‘అసురన్’ స్టిల్

SMTV Desk 2019-04-30 16:34:06  dhanush, dhanush asuran movie first look

చెన్నై: అటు తమిళ్ లో ఇక్కడ తెలుగులో విపరీత ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న తమిళ్ హీరో ధనుష్. 3 ,‘రఘువరన్ బీటెక్’, ‘మారి’, ‘మారి 2’ చిత్రాలతో ధనుష్ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ధనుష్ ప్రస్తుతం హీరోగా నటిస్తోన్న తమిళ చిత్రం ‘అసురన్’. వెట్రిమారన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ధనుష్ పాత్ర చాలా రఫ్‌గా ఉంటుంది. ఈ చిత్రంలోని పోస్టర్‌ను తాజాగా ధనుష్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ పోస్టర్‌‌ను చూసినవాళ్లకు ఈయన ఎవరు అనే అనుమానం కలగక మానదు. ఎందుకంటే అంతలా గుర్తుపట్టేని విధంగా ఉన్నారు ధనుష్. గుబురు మీసాలు, గెడ్డం, పంచా లాల్చీ, చేతిలో కత్తి.. ఇలా ఊర మాస్ లుక్‌లో ధనుష్ అదరగొట్టారు. ఈ పోస్టర్ చూస్తుంటేనే సినిమాపై ఆసక్తి పెరిగిపోతోంది.