పంజాబ్‌ జట్టు సహయజమానికి జైలు శిక్ష

SMTV Desk 2019-04-30 16:28:28  kxip, ipl 2019, kxip, ness wadiaNess Wadia, sentenced to 2-year jail

న్యూఢిల్లీ: ఐపీఎల్ జట్టు కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ సహయజమాని నెస్‌ వాదియా జైలు పాలయ్యాడు. జపాన్‌లో డ్రగ్స్‌తో పట్టుబడిన కేసులో అతనికి రెండేళ్ల జైలు శిక్ష ఖారరైంది. నెస్‌ వాదియా ఈ ఏడాది మార్చిలో 25 గ్రాముల మత్తుపదార్థాలతో జపాన్‌లో పట్టుబడిన విషయం తెలిసిందే. నెస్‌ వాదియా ఓ విమానాశ్రయంలో 25 గ్రాముల మత్తుపదార్థాలతో పట్టుబడ్డాడు. తన వ్యక్తిగత వాడకం కోసం మత్తుపదార్థాలను తెచ్చుకుంటున్నానని అరెస్టు ఐన సందర్బంలో ఆయన తెలిపాడు. అరెస్టుకు తర్వాత వాదియా కోర్టుకు హాజరయ్యాడు. తాజా కోర్టు వాదియాకు రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించింది.