అమెరికా అధ్యక్షుడి కొత్త స్పెల్లింగ్

SMTV Desk 2017-08-21 17:40:41  USA President, Trump, Tweet, Spelling mistake, Sensation

అమెరికా, ఆగస్ట్ 21: సంచలనకరమైన వ్యాఖ్యలు చేయడంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎప్పుడు ముందు వరసలోనే ఉంటారు. తాజాగా ఆయన చేసిన ట్వీట్ స్పెల్లింగ్ మిస్టేక్ కారణంగా మరోసారి సంచలనం సృష్టించారు. వివరాల్లోకి వెళ్తే... చార్ల‌సెట్‌విల్లే ఘ‌ట‌న‌పై అమెరికానుద్దేశించి ట్రంప్ చేసిన ట్వీట్‌లో `హీల్‌` అనే ప‌దం స్పెల్లింగ్ త‌ప్పుగా రాశారు. ఆ ట్వీట్‌లో ఇదే పదాన్ని రెండోసారి కూడా తప్పుగా చేయడం వల్ల నెటిజన్లు ఆయనపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. దీంతో మ‌న అధ్య‌క్షుడు ఇడియ‌ట్‌, హీల్ స్పెల్లింగ్ రాని నీవు రేపు యుద్ధం వ‌స్తే న్యూక్లియ‌ర్ కోడ్‌ల‌ను ఎలా ఎంట‌ర్ చేస్తావ్‌! వంటి కామెంట్ల‌తో పాటు ఆయ‌న‌ను అనుక‌రిస్తూ త‌ప్పుడు ప‌దాల‌తో చాలా మంది ట్వీట్ చేశారు. త‌ర్వాత కాసేప‌టికి ట్రంప్ త‌న ట్వీట్‌ను స‌రిచేసుకున్నాడు. గ‌తంలో కూడా డిక్ష‌న‌రీలో లేని `కౌఫెఫె` ప‌దాన్ని ట్రంప్ ట్వీట్ చేయగా, దాని అర్థం తెలియని నెటిజన్లు కామెంట్ల వ‌ర్షం కురిపించిన విషయం తెలిసిందే.