నేడు న్యూజిలాండ్‌ ఓపెన్‌ టోర్నీ ప్రారంభం

SMTV Desk 2019-04-30 12:42:57  newzealand open tournament, saina nehwal

నేడు న్యూజిలాండ్‌ ఓపెన్‌ టోర్నీ ప్రారంభం కానుంది. క్వాలిఫైయింగ్‌ విభాగంలో మ్యాచ్‌లు నేడు జరగనుండగా బుధవారం మెయిన్‌ డ్రా మ్యాచ్‌లు మొదలవనున్నాయి. భారత స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ టైటిల్‌ గెలవాలని లక్ష్యంగా బరిలో దిగుతుంది. సైనా సింగిల్స్‌ తొలి రౌండ్‌లో వాంగ్‌ జియి(చైనా)తో తలపడనుంది. ఈ ఏడాది భారత్‌ నుంచి సైనా మాత్రమే అంతర్జాతీయ టైటిల్‌ణు సాధించింది. పురుషుల సింగిల్స్‌లో సాయి ప్రణీత్‌, ప్రనయ్ పోటీలో ఉన్నారు. తొలిరౌండ్లో ప్రణీత్‌, శుభశంకర్‌తో, ప్రనయ్..కిన్‌ యితో పోటీ పడనూన్నరు. క్వాలిఫైయింగ్‌లో అజయ్ జయరామ్‌, లక్ష్యసేన్‌, పారుపల్లి కశ్యప్‌లు బరిలో ఉన్నారు. పురుషుల డబుల్స్‌లో మను అత్రి-సుమీత్‌ రెడ్డి జోడి, మహిళల డబుల్స్‌లో సిక్కిరెడ్డి-అశ్విని పొన్నప్ప జంటలు పోటీపడనున్నాయి.