పెళ్లి ముచ్చట్లు చెప్పిన యువ హీరో

SMTV Desk 2019-04-30 12:37:46  Nikhil, Tollywood,

యువ హీరోల్లో విభిన్న కథ కథనాలు తీస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న హీరో నిఖిల్ సిద్ధార్థ్ త్వరలో అర్జున్ సురవరం సినిమాతో రాబోతున్నాడు. తమిళ సినిమా కణితన్ రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా మాత్రుక దర్శకుడు టి.ఎన్. సంతోష్ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా ఈ నెల చివరన రిలీజ్ అవ్వాల్సి ఉన్నా అవెంజర్స్ ఎండ్ గేమ్ వల్ల వాయిదా వేయాల్సి వచ్చింది. ఇదిలాఉంటే మే మూడవ వారంలో రిలీజ్ అవుతున్న అర్జున్ సురవరం సినిమా ప్రమోషన్స్ మాత్రం స్పీడందుకున్నాయి.

ఈ ప్రమోషన్స్ లో భాగంగా నిఖిల్ పెళ్లి ప్రస్థావన వచ్చింది. 30 ప్లస్ వచ్చినా ఇంకా అప్పుడే పెళ్లి గురించి ఆలోచించలేదని చెబుతున్నాడు నిఖిల్. అయితే తనకు భానుమతి లాంటి అమ్మాయి కావాలని అంటున్నాడు. ఫిదాలో సాయి పల్లవి లాంటి అమ్మాయి అయితే తనకు నచ్చుతుందని అన్నాడు. అంతేకాదు ఖుషి సినిమాలో భూమిక పాత్ర బాగుంటుందని. గోదావరిలో సీత పాత్ర లాంటి అమ్మాయి కావాలని అంటున్నాడు. మరి మనవాడికి ఇన్ని కోరికలు ఉండగా వచ్చే అమ్మాయి ఎలా ఉంటుందో చూడాలి.