దుమ్ములేపుతున్న 'ఎన్.జి.కే' ట్రైలర్

SMTV Desk 2019-04-30 12:36:04  ngk trailer,

కోలీవుడ్ నటుడు సూర్య లీడ్ రోల్ లో సెల్వ రాఘవన్ డైరక్షన్ లో వస్తున్న సినిమా ఎన్.జి.కే. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ మూవీ ట్రైలర్ నిన్న రిలీజైంది. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా ట్రైలర్ విషయానికొస్తే దేశం మీద ప్రేమ, బాధ్యత ఉన్న ఓ వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి ఏం చేశాడు అన్నది సినిమా కథ అని తెలుస్తుంది.



కోలీవుడ్ లో సూర్యకు క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలుగులో కూడా అదే విధమైన ఇమేజ్ ఉంది. అందుకే తెలుగులో కూడా ఎన్.జి.కె ను రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా తెలుగుకు కూడా సూర్య సొంత డబ్బింగ్ చెప్పడం విశేషం. మే 31న రిలీజ్ ప్లాన్ చేసిన ఎన్.జి.కే ట్రైలర్ ఇంప్రెస్ చేయగా సినిమా ఎలా ఉంటుందో చూడాలి. సూర్య ఎలాగైనా ఈ సినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు.