టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్

SMTV Desk 2019-04-30 12:34:47  ipl 2019, srh vs kxip

హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్లో భాగంగా నేడు హైదరాబాద్ ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు తలపడుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇక ఈ సీజన్లో ఇప్పటి వరకూ 11 మ్యాచ్‌లాడిన హైదరాబాద్ జట్టు ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. 11 మ్యాచ్‌లాడిన పంజాబ్ కూడా ఐదు విజయాలు సాధించినా.. నెట్‌ రన్‌రేట్‌లో వ్యత్యాసం కారణంగా ఆరో స్థానంలో ఉంది.

Sunrisers Hyderabad (Playing XI): David Warner, Kane Williamson(c), Manish Pandey, Vijay Shankar, Mohammad Nabi, Wriddhiman Saha(w), Abhishek Sharma, Rashid Khan, Bhuvneshwar Kumar, K Khaleel Ahmed, Sandeep Sharma.

Kings XI Punjab (Playing XI): Lokesh Rahul, Chris Gayle, Mayank Agarwal, David Miller, Nicholas Pooran(w), Simran Singh, Ravichandran Ashwin(c), Murugan Ashwin, Mohammed Shami, Arshdeep Singh, Mujeeb Ur Rahman.