కువైట్ లో వలసలు నిషేధం!

SMTV Desk 2019-04-30 11:03:37  Kuwait, Kuwait labors

కువైట్: కార్మికులు బతుకుదెరువు కోసం అనేక మంది వలసవెళ్ళే దేశం కువైట్. ఇప్పుడు ఈ దేశం కార్మికుల వలసలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. నానాటికీ వలసదారుల సంఖ్య పెరిగిపోతుండటంతో వలసలను ఆపాలని నిర్ణయించింది కువైట్ ప్రభుత్వం. వివిధ దేశాల నుంచి అక్కడికి వెళ్లడంతో స్థానిక ప్రజలకు ఉద్యోగాలు కరువు అవుతున్నాయని కువైట్ ప్రభుత్వం వాదిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గినియా, ఇథియోపియా, భూటాన్, గినియా బిసో, బుర్కినా ఫాసో దేశాల నుంచి వలసలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో వలసల విషయంలో కువైట్ నిషేధం ఎదుర్కొంటున్న దేశాల సంఖ్య ఇరవైకి చేరింది. ఈ ఐదు దేశాలేకాకుండా ఎరిట్రియా, కామెరూన్, లైబీరియా, కాంగో, బురుండి దేశాల నుంచి వచ్చే వలసదారులపై కూడా తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నట్లు కువైట్ తెలిపింది. ఇదివరకే ఆఫ్రికాలోని డిజిబౌటి, టోగో, కెన్యా, ఉగాండా, నైజీరియా,సెనెగల్, మలావి, నైజర్, చాడ్, సియరా లియోన్, టాంజానియా, గాంబియా, మడగాస్కర్, ఘనా, జింబాబ్వే దేశాల నుంచి వచ్చే వలసదారులపై కువైట్ ఇంతకుముందే నిషేధం విధించింది.