తుని లో దారుణం .. మట్టిపెళ్లలు విరిగి ఇద్దరు మృతి

SMTV Desk 2019-04-29 15:59:27  west godavari district, tuni shivaru, sand stones fall down on five people

తూర్పుగోదావరి: జిల్లా తుని శివారు ఉప్పరగూడెంలో సోమవారం ఉదయం దారుణం చోటు చేసుకుంది. శివారులో మట్టి తవ్వుతున్న కూలీలపై మట్టి పెళ్లలు విరిగిపడడంతో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం నుంచి ఒకరు మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. నదిలో ఐదుగురు కూలీలు మట్టి తవ్వుతున్నారు. అకస్మాత్తుగా మట్టి పెళ్లలు విరిగి కూలీలపై పడ్డాయి. ఈ ప్రమాదంలో శ్రీనివాస్‌ కుమార్‌(40), వీసం సత్తిబాబు (55) మృతి చెందారు.మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని, ఒకరు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం కోసం శ్రీనివాస్‌ కుమార్‌, వీసం సత్తిబాబు మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తన్నట్టు పోలీసులు వెల్లడించారు.