క్యాట్ వాక్‌ చేస్తూ కుప్పకూలిన బ్రెజిల్ మోడల్

SMTV Desk 2019-04-29 12:57:21  Brazil model died while cat walk

బ్రెజిల్: బ్రెజిల్ లో విషాద సంఘటన చోటు చేసుకుంది. సావో పౌల్ ఫ్యాషన్ వీక్‌లో (ఎస్‌పిఎఫ్‌డబ్లూ) క్యాట్ వాక్‌ చేస్తూ ఓ బ్రెజిల్ మోడల్ కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. ‘ఒక్సా షోలో మోడల్ టేల్స్ సోరెస్ హఠాత్తుగా అస్వస్థతకు గురై చనిపోయాడని ఎస్‌పిఎఫ్‌డబ్లూకు ఇప్పుడే వార్త అందింది’ అని నిర్వాహకులు తెలిపారు. కానీ అతని మృతికి కారణం చెప్పలేదు. రన్ వేను వదలి వెళ్లేందుకు మలుపు తిరుగుతుండగా ఈ 26 ఏళ్ల మోడల్ కిందపడిపోయాడు. వెంటనే వైద్యసిబ్బంది అతని వద్దకు వెళ్లారు. ప్రేక్షకుల సమక్షంలోనే ఇదంతా జరిగిందని స్థానిక మీడియా తెలిపింది.టేల్స్‌ను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే అతను చనిపోయాడని డాక్టర్లు తెలిపారు.