హోండా సీబీ హార్నెట్ మోడిఫైడ్ వెర్షన్

SMTV Desk 2019-04-29 12:35:55  honda, honda cb hornet

న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ హోండా తన హోండా సీబీ హార్నెట్ బైక్‌కు మార్కెట్లో మంచి పాపులారిటీ ఉంది. అయితే తాజాగా ఎస్‌వీ స్టిక్కర్స్ అనే సంస్థ ఈ బైక్‌ను మోడిఫైడ్ చేసి రిలీజ్ చేసింది. దీని పేరు మెటాలిక్ పర్సూల్ ఎడిషన్. అదిరిపోయే స్ట్రీట్ బైక్స్‌లో ఇదొకటని చెప్పుకోవచ్చు. ఇకపోతే బైక్‌లో 162.71 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇంజిన్ మాగ్జిమమ్ పవర్ 14.9 హెచ్‌పీ@8500. బైక్‌లో ఐదు గేర్లు ఉంటాయి. ఫ్యూయెల్ ట్యాక్ సామరర్థ్యం 12 లీటర్లు. టాప్ స్పీడ్ గంటకు 110 కిలోమీటర్లు. మైలేజ్ లీటరుకు 40 నుంచి 50 కిలోమీటర్లు ఉండొచ్చు. ఇక మాగ్జిమమ్ టార్క్ 14.5 ఎన్ఎం@6500. బైక్ ధర రూ.92,000.