'ప్యాకప్!! డియర్ కామ్రేడ్ షూటింగ్ పూర్తి'

SMTV Desk 2019-04-28 18:53:37  packup, dear comrade,

విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా తెరకెక్కుతోన్న సినిమా ‘డియర్ కామ్రేడ్’. భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సుమారు ఏడాది క్రితం ప్రారంభమై ఎట్టకేలకు నిన్నటితో షూటింగ్‌ను పూర్తిచేసుకుంది. ఈ మేరకు దర్శకుడు భరత్ కమ్మ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘ప్యాకప్!! డియర్ కామ్రేడ్ షూటింగ్ పూర్తయింది! సుమారు ఏడాదిపాటు షూటింగ్‌ను చాలా గొప్పగా చేశాం. అందరినీ మిస్సవుతున్నా’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన, ఇతర టీమ్ సభ్యులతో కూడిన ఫొటోను కూడా షేర్ చేశారు. గీతగోవిందం వంటి సూపర్ హిట్‌ సినిమా తర్వాత విజయ్‌ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన చిత్రం ఇది. కాలేజీ రాజకీయాలు, ప్రేమ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో విజయ్ స్టూడెంట్ గా, రష్మిక క్రికెటర్ గా నటిస్తున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూర్చారు. త్వరలోనే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల చేస్తున్నారు.