మట్టుబెట్టేందుకు పృథ్వీ-2 సిద్ధం

SMTV Desk 2017-06-02 18:31:42  pruthvi-2, teste, balosore, drdo

బాలాసోర్, జూన్ 2‌ : భారత అమ్ములపొదిలో మరో అస్త్రం చోటు చేసుకుంది. ఉపరితలం నుండి ఉపరితలం పై ఉన్న లక్ష్యాలను అత్యంత సునాయసంగా ఛేదించగల పృథ్వీ-2 క్షిపణి అన్ని పరీక్షలను తట్టుకొని విజయవంతమైన పనితీరును కనబర్చింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రక్షణ, పరిశోధన, అభివృద్ధి సంస్థ శాస్త్రవేత్తలు రూపొందించారు. పూర్తి స్థాయిలో శత్రు దేశాన్ని భస్మిపటలం చేయగలదు. అణు సామర్థ్యంతో రూపొందించిన ఈ క్షిపణిని సైన్యం నేడు ఒడిశాలోని చాందీపూర్ సమీపంలో గల ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి పరీక్షించింది. నేటి ఉదయం ట్రయల్ చేయగా ..అది విజయవంతమైందని అధికారిక వర్గాలు వివరించాయి. పృథ్వీ-2 ఖండంతర్గత క్షిపణి..ఉపరితలం నుండి ఉపరితలం పై 350 కి.మీ.దూరంలోని లక్ష్యాలను సమర్థవంతంగా చేధించగలదు. 500 కేజిల నుంచి 1000 కేజీల వార్ హెడ్స్ ను మోసుకెళ్ళే సామర్ధ్యం పృథ్వీ సోంతం. గత సంవత్సరం నవంబర్ లో మెుదటి సారి పరీక్షించారు. అడ్వాన్స్‌ ఇన్‌ఎరిటల్‌ గైడెన్స్‌ సిస్టమ్‌ సాయంతో ఈ క్షిపణి లక్ష్యాన్ని చేధించగలదు.