రామ్ గోపాల్ వర్మకు షాక్

SMTV Desk 2019-04-28 18:48:23  Ram Gopal Varma,

విజయవాడలోని ఎన్టీఆర్ సర్కిల్ లో మీడియా సమావేశం పెడతానన్న లక్ష్మీస్ ఎన్టీఆర్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు అనుకోకుండా షాక్ తగిలింది. గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న వర్మను పోలీసులు అడ్డుకున్నారు. విజయవాడలోని ప్రకాశ్ నగర్ కు చేరుకున్న వర్మ వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు.. విజయవాడలోకి మిమ్మల్ని అనుమతించలేం. శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి దయచేసి వెనక్కి వెళ్లిపోండి అంటూ వివరించారు. కోరారు.

అదేవిధంగా వర్మ ఎంతకీ పట్టించుకోక పోవడంతో ఓ పోలీస్ వాహనాన్ని ఎస్కార్డ్ గా ఇచ్చి బలవంతంగా గన్నవరం ఎయిర్ పోర్టుకు తిప్పి పంపారు. ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను వచ్చే నెల 1న విడుదల చేసేందుకు వర్మ ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఇందుకు సంబంధించి ప్రమోషనల్ కార్యక్రమంలో భాగంగా వర్మ నోవాటెల్ హోటల్ ను బుక్ చేసుకున్నారు. అయితే అనివార్య కారణాలతో నోవాటెల్ యాజమాన్యం కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేదు.

అంతటితో ఆగకుండా నడిరోడ్డుపైనే మీడియా సమావేశం పెడతానని వర్మ హెచ్చరించారు. అలాగే... వర్మ నిజంగా సమావేశం పెడితే టీడీపీ శ్రేణులు అడ్డుకునే అవకాశముందనీ.. దీనివల్ల గొడవలు జరగవచ్చని భావించిన పోలీసులు వర్మను గన్నవరం ఎయిర్ పోర్టుకు తిరిగిపంపినట్లు సమాచారం అందుతుంది.