విరిగి పడిపోయిన భారీ క్రేన్ ..నలుగురు మృతి

SMTV Desk 2019-04-28 18:47:03  Crane, Crane collapsed ,

వాషింగ్టన్: సియాటెల్ లోని గూగుల్ ప్రధాన కార్యలయంలో నిర్మాణ పనులకు వినియోగిస్తున్న భారీ క్రేన్ విరిగి పడింది. ఈ ఘటనలో నలుగురు చనిపోగా… మరో నలుగురు తీవ్రంగా గాయాపడ్డారు. కొత్త క్యాంపస్ ను నిర్మించడానికి భవంతి పైన అమర్చిన క్రేన్ విరిగి, కింద ఉన్న కార్లపై పడింది. దీంతో ఆరు వాహనాలు తీవ్రంగా దెబ్బతినగా, నలుగురు మరణించారని సియాటెల్ ఫైర్ సిబ్బంది పేర్కొంది. మృతి చెందిన వారిలో ఓ మహిళ ఉంది. మృతుల్లో ఇద్దరు క్రేన్ ఆపరేటర్లు, మిగతావారు కార్లలో ఉన్న వారని అధికారులు వెల్లడించారు. క్షతగాత్రుల్లో నాలుగు నెలల చిన్నారి ఉన్నట్టు సమాచారం. వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించారు. క్రేన్ విరిగి పడటంపై వాషింగ్టన్ స్టేట్ డిపార్ట్ మెంట్ ఆఫ్ లేబర్ అండ్ ఇండస్ట్రీస్ విభాగం విచారణ జరుపుతోందని అధికారులు పేర్కొన్నారు.