అమెరికాలో మళ్లీ కాల్పుల మోత.

SMTV Desk 2019-04-28 18:44:38  America, one killed

శాండియోగో: అమెరికాలో కాలిఫోర్నియా శాండియోగో ప్రాంతంలోని యూదుల ప్రార్థనా మందిరం సినగాగ్‌లో దుండగుడు చొరబడి అక్కడున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఓ మహిళ, ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాల్పుల అనంతరం పారిపోతున్న దుండగుడిని అక్కడి భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడుని అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు.