ఆ అలవాటు ఇప్పుడు మరీ ఎక్కువైపోయింది

SMTV Desk 2019-04-28 18:42:03  samantha

అక్కినేని సమంత పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉంది. సాధారణంగా పెళ్లితర్వాత హీరోయిన్లలో చాలా మార్పులు వస్తాయి. సినిమాలను తగ్గించడం, గ్లామర్ షోలకు దూరంగా ఉండడంతో పాటు బయట పార్టీలకు వెళ్లడాన్ని తగ్గిస్తారు. కానీ సమంత మాత్రం అస్సలు మారలేదట. పెళ్లి తర్వాత తన వ్యక్తిగత స్వేచ్ఛలో ఏమాత్రం తేడా రాలేదని ఆమె అంటోంది. అయితే పెళ్లికి ముందు ఉన్న ఒక అలవాటులో మాత్రం చాలా తేడా వచ్చిందని చెబుతోంది. తనకు చాదస్తం మరి ఎక్కువైపోయిందని చెప్పింది సమంత. “మొదటి నుంచి సినిమా కథ విన్నప్పుడు అందులో అది బాలేదు, ఇది బాలేదు అనేదాన్ని. ఆ అలవాటు ఇప్పుడు మరీ ఎక్కువైపోయింది”అని సమంత పేర్కొంది. ప్రతి సినిమాలో ఇప్పుడు లోపాలను వెతకాల్సి వస్తోందని…చాలా వరకు కథలకు నో చెబుతున్నానని అంటోంది ఈ భామ. ఇకనుంచి ఎంత పెద్ద సినిమా అయినా సరే కథలో తన పాత్రకు ప్రత్యేక స్థానం ఉంటేనే ఓకే చెబుతుందట. ఇక లేడీ ఓరియెంటెట్ సినిమాలు వస్తే తప్పకుండా చేస్తానని చెబుతోంది సమంత.