నడిరోడ్డు పైనే ప్రెస్ మీట్,, వర్మ సంచలనం

SMTV Desk 2019-04-28 12:56:04  rgv, Ram gopal varma

ఎట్టకేలకు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని ఆంధ్ర ప్రదేశ్ లో విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఎన్నికల అయిపోవడంతో కోర్టు ఉత్తర్వుల ప్రకారం వర్మ సినిమా రిలీజ్ చేసుకోవచ్చు. దీంతో మూవీ కి సంబంధించిన విశేషాలను పంచుకునేందుకు వర్మ విజయవాడలోని నోవాటెల్ హోటల్లో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించాలని ప్లాన్ చేశారు. కానీ హోటల్ యాజమాన్యం వర్మ బుకింగ్ క్యాన్సిల్ చేశారట. దీంతో వర్మ.. మరో అడుగు ముందుకేసి ఏకంగా నడిరోడ్డుపై ప్రెస్ మీట్ పెడతానంటూ సంచలన ప్రకటన చేశారు.ఈరోజు సాయంత్రం విజయవాడలోని పైపుల రోడ్డులో నడిరోడ్డు మీద సాయంత్రం 4 గంటలకు ప్రెస్ మీట్ పెడుతున్నా. మీడియా మిత్రులకి, ఎన్టీఆర్ అభిమానులకి, నా మీద కోద్దో, గొప్పో ఇష్టం ఉన్న వారికి నా బహిరంగ ఆహ్వానం అంటూ ట్వీట్ చేశారు.