రాజస్థాన్ ప్లే ఆఫ్ ఆశలు సజీవం ..

SMTV Desk 2019-04-28 12:54:00  Rajsthan, Srh,

జైపూర్: సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై రాజస్థాన్ రాయల్స్ జట్టు ఘన విజయం సాధించింది. హైదరాబాద్ నిర్దేశించిన 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. సంజుశాంసన్‌(48), స్టీవ్‌స్మిత్‌(22), అజింక్య రహానె(39), లివింగ్‌స్టోన్(44)లు రాణించడంతో రాజస్థాన్ జట్టు 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది.

అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ 37, మనీష్ పాండే 61 రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో వరుణ్ అరోన్, ఉనద్కట్, రియాన్ పరియాగ్, శ్రేయస్ గోపాల్ లు తలో వికెట్ తీశారు.