హైదరాబాద్ పై ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్తాన్

SMTV Desk 2019-04-28 12:50:55  ipl 2019, rr vs srh

జైపూర్: ఐపీఎల్ 2019 సీజన్లో భాగంగా నేడు జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్ జట్టుతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్తాన్ బౌలింగ్ ను ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టుకి ఓపెనర్ జానీ బరిస్టో దూరమయ్యాడు. ఇక ఈ సీజన్లో 10 మ్యాచ్ లు ఆడిన హైదరాబాద్ ఐదింటిలో గెలిచి మరో ఐదు మ్యాచ్ లలో ఓటమి పాలయింది. +0.654 రన్ రేట్ తో 10 పాయింట్లు సంపాదించుకొని పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది, రాజస్తాన్ జట్టు ఈ సీజన్లో 11 మ్యాచ్ లు ఆడి నాలుగింట్లో గెలుపొందగా మిగితా 7 మ్యాచ్ లలో ఓడిపోయింది. -0.390 రాన్ రేట్ తో 8 పాయింట్లు సంపాదించుకొని పాయింట్ల పట్టికలో 7 వ స్థానంలో ఉంది.

Sunrisers Hyderabad (Playing XI): David Warner, Kane Williamson(c), Manish Pandey, Vijay Shankar, Shakib Al Hasan, Wriddhiman Saha(w), Deepak Hooda, Rashid Khan, Bhuvneshwar Kumar, Siddarth Kaul, K Khaleel Ahmed.

Rajasthan Royals (Playing XI): Ajinkya Rahane, Sanju Samson(w), Steven Smith(c), Riyan Parag, Ashton Turner, Liam Livingstone, Stuart Binny, Shreyas Gopal, Jaydev Unadkat, Varun Aaron, Oshane Thomas.