డేటా చోరీ చేసే యాప్స్ ఇవే

SMTV Desk 2019-04-27 16:53:18  data transfer, Selfie Camera, Total Cleaner, Smart Cooler, RAM Master, AIO Flashlight, Omni Cleaner , google play store

హైటెక్: గూగుల్ ప్లే స్టోర్ లో ఉన్న యాప్స్ అన్ని సురక్షితమైనవి కాదు. అందులో కొన్ని జెన్యూన్ గా ఉంటాయి మరికొన్ని డేటా స్కాం చేసే యాప్స్ కూడా ఉంటాయి. అయితే డేటా చోరీ చేసే యాప్స్ లో Selfie Camera, Total Cleaner, Smart Cooler, RAM Master, AIO Flashlight, Omni Cleaner ఇవి ప్రధానమైనవి. ఇవి మీ ఫోన్ లో ఉంటె మీకు తెలీకుండానే మీ డేటా అంతా చోరీ అవుతుంది. వీటిని ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్ నుండి తొలగించడం జరిగింది. ఈ అప్లికేషన్లు పెద్ద మొత్తంలో పర్మిషన్ లు సేకరించటంతో పాటు, ఒకసారి పర్మిషన్ ఇచ్చిన తరువాత మన వ్యక్తిగత డేటాను మనకు తెలియకుండా దొంగతనం చేస్తున్నాయి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ Do Global అనే సంస్థ గూగుల్ ప్లే పాలసీలకు విరుద్ధంగా చైనాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న తన పేరు మీద కాకుండా, USలో ఉన్న మరో కంపెనీ పేరు మీద ఈ అప్లికేషన్లను గూగుల్ ప్లే స్టోర్ లో అప్లోడ్ చేసింది.మన ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్న అప్లికేషన్ల ఇలా పెద్ద మొత్తంలో పర్మిషన్లు తీసుకుని డేటాని దుర్వినియోగం చేయకుండా ఉండటం కోసం గూగుల్ సంస్థ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం లో కీలకమైన మార్పులు చేయబోతోంది. రాబోయే ఆండ్రాయిడ్ వెర్షన్లలో దీనికి సంబంధించిన మార్పులు మనం చూడవచ్చు.