రియల్‌మి 3 ప్రొ న్యూ వేరియెంట్ రిలీజ్

SMTV Desk 2019-04-27 16:17:12  Realme 3 Pro, Realme 3 Pro launches

ప్రముఖ స్మార్ట్ ఫోన్స్ తయారీ సంస్థ ఒప్పో సబ్‌బ్రాండ్ రియల్‌మి తాజాగా మార్కెట్లోకి తన సరికొత్త స్మార్ట్ ఫోన్ రియల్‌మి 3 ప్రొ విడుదల చేసింది. రూ.15,999 ధరకు 6జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ఫోన్ వినియోగదారులకు ఈ నెల 29వ తేదీ నుంచి లభ్యం కానుంది. ఇక ఈ ఫోన్లో మిగిలిన ఫీచర్లన్నీ అలాగే ఉన్నాయి. రియల్‌మి 3 ప్రొ ఫీచర్లు... 6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2340 × 1080 పిక్సల్స్ స్ర్కీన్ రిజల్యూషన్‌, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్‌, 4/6 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్‌, డ్యుయల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, 16, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 4045 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్‌.