ఈ ఏడాది అర్జున అవార్డులకు ఎంపికైంది వీరే

SMTV Desk 2019-04-27 15:59:54  mohammed shmi, jasprit bumrah, ravindra jadeja, poonam yadav, arjuna award 2019

న్యూఢిల్లీ: భారత క్రీడారంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే అర్జున అవార్డులకు ఈ ఏడాది బీసీసీఐ నలుగురు క్రీడాకారుల పేర్లను ప్రతిపాదించింది. వీరిలో భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ షమీ, బుమ్రా, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, మహిళా క్రీడాకారిణి పూనమ్ యాదవ్‌ లు ఉన్నారు. క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి కేంద్ర క్రీడల మంత్రిత్వశాఖ ఈ అవార్డుతో ప్రతిఏటా సత్కరిస్తుంది. ప్రతిష్టాత్మక అవార్డును 2018లో మహిళల క్రికెట్ స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన మాత్రమే అందుకుంది. తుది నిర్ణయం తీసుకునేందుకు బీసీసీఐ పాలకవర్గం ఢిల్లీలో సమావేశమై సుదీర్ఘ కసరత్తు చేసింది. క్రికెట్ ఆపరేషన్స్ జనరల్ మేనేజర్ సాబా కరీమ్ ఈ నలుగురి పేర్లను ప్రతిపాదించగా, వినోద్ రాయ్, డయానా ఎడుల్జి, లెఫ్టినెంట్ జనరల్ రవి తోడ్గేలతో కూడిన పాలకవర్గం ఆమోద ముద్ర వేసింది