ట్రంప్ పై ఫోన్ విసిరన వ్యక్తి

SMTV Desk 2019-04-27 15:57:04  Man tosses cellphone, removed from Trump speech, america president donlad trump

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై ఓ వ్యక్తి మొబైల్ ఫోన్ ను విసిరాడు. ఈ సంఘటన ఇప్పుడు అక్కడ చర్చానీయంశంగా మారింది. అమెరికాలోని ఇండియానా పోలీస్ నేషనల్ రైఫిల్స్ అసోసియేషన్ సమావేశంలో మాట్లాడేందుకు పోడియం వద్దకు వస్తుండగా ఓ వ్యక్తి సెల్ ఫోన్ విసిరాడు. అది ట్రంప్ కు తగలకుండా దూరంగా పడిపోయింది. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది ఆ వ్యక్తి ని బయటకు పంపివేశారు. అనంతరం ట్రంప్ తన ఉపన్యాసం కొనసాగించారు. అంతసేపు అగంతకుడు విసిరిన సెల్ ఫోన్ పోడియంపైనే ఉంది.