మరో బంపర్ ఆఫర్ కొట్టిన ప్రియా ప్రకాష్

SMTV Desk 2019-04-27 15:56:13  Priya Prakash Varrier,

అలా కన్నుకొట్టి ఒక్కసారిగా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ స్థాయి గుర్తింపు అందుకున్న కేరళ సుందరి ప్రియా వారియార్. ఈ ఇంటర్ నెట్ సంచలనం నటించిన లవర్స్ డే పరాజయం పాలైనయినప్పటికీ... మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో బాలీవుడ్ నుంచి శ్రీదేవి బంగ్లా సినిమాలో ఆఫర్ వచ్చింది. అయితే ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమా రీలీజ్ కాకముందే బాలీవుడ్ నుంచి మరో అఫర్ కొట్టేసింది ఈ కన్నుగీటు సుందరి. లవ్ హ్యాకర్స్ పేరుతో తెరకెక్కబోతున్న హిందీ సినిమాలో ప్రియా వారియర్ హీరోయిన్ గా నటించే అవకాశాన్ని దక్కించుకుంది.

కాగా మయాంక్ ప్రకాష్ శ్రీవాస్తవ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మే నుంచి సెట్స్ మీదకు వెళ్ళనున్నట్లు తెలుస్తోంది. క్రైమ్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో ప్రియా వారియర్ ఎలాంటి నటనతో ఆకర్షించబోతుందో చూడాలి.