జెర్సీ సినిమా తో ఊపుమీదఉన్న నాచురల్ స్టార్ నాని తన తదుపరి సినిమా ప్లానింగ్ లో నిమగ్నమయ్యాడు ... ఇంద్రగంటి మోహనకృష్ణతో కలిసి సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో నానితో పాటు సుధీర్ బాబు కూడా నటిస్తున్నాడు.
ఈ సినిమాకి వ్యూహం అనే టైటిల్ ను పరిశిలీస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ ఈ సినిమాకి వి అనే టైటిల్ ను ఖరారు చేశారనే టాక్ వినిపిస్తోంది. వి అనే అక్షరానికి కథకి ఎలాంటి సంబంధముందనేది ఆసక్తిని కలిగించే విషయం. ఈ నెల 29వ తేదీన టైటిల్ లోగోతో కూడిన ఫస్టులుక్ పోస్టర్ ను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఆ రోజునే కథానాయికలకు సంబంధించిన విషయంలోను స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది.