శ్రీలంకలో ఉగ్రవాదులపై వరుస దాడులు

SMTV Desk 2019-04-27 12:19:59  srilanka, firing between srilanka army and terrorists

కొలంబో: శ్రీలంకలో శనివారం ఉదయం మరో సారి ఉగ్రవాదులకు, భద్రత బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు ఇస్లామిక్ ఉగ్రవాదులు హతమయ్యారు. ‌మ్మునాయి ప‌ట్ట‌ణంలో ఓ ఇంట్లో ఇస్లామిక్ ఉగ్రవాదులు ఉన్నట్టు భద్రతాబలగాలకు సమాచారం అందింది. దీంతో ఆ ఇంట్లోకి ప్ర‌వేశించేందుకు భ‌ద్ర‌తా ద‌ళాలు ప్ర‌య‌త్నించాయి. ఈ క్రమంలో ఇస్లామిక్ ఉగ్ర‌వాదులు కాల్పుల‌కు దిగారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. దీంతో న‌లుగురు ఉగ్ర‌వాదులు హతమైనట్టు అధికారులు తెలిపారు. ఈ కాల్పుల్లో ఓ సాధార‌ణ పౌరుడు కూడా మృతిచెందాడు. దీనికి ముందు శుక్రవారం రాత్రి కూడా ఎదురు కాలుపు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు సూసైడ్ బాంబర్లు తమను తాము పేల్చుకున్నారు. ఈ ఎదురుకాల్పుల్లో 15 మంది మృతి చెందగా పలువురు ఉగ్రవాదులు గాయాలతో తప్పించుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.