డుకాటి బైక్‌ షోరూం ప్రారంభించిన మామ-అల్లుడు ...

SMTV Desk 2019-04-27 11:05:35  Dukati show room, Venkatesh, Naga Chaitanya

విక్టరీ వెంకటేష్‌, యువసామ్రాట్‌ అక్కినేని నాగచైతన్య కలిసి డుకాటి షోరూం ప్రారంభించారు. ప్రముఖ మోటార్‌ సైకిల్‌ తయారీ సంస్థ.. డుకాటి ఇండియా.. తాజాగా.. భారతదేశంలో 9వ షోరూమ్‌ను ఏర్పాటు చేసింది. శుక్రవారం హైదరాబాద్‌, బంజారా హిల్స్‌ రోడ్‌ నెం. 12లో ఈ షోరూమ్‌ ప్రారంభ వేడుక జరిపింది. ఈ కార్యక్రమానికి వెంకీ మామతో పాటు.. నాగ చైతన్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వెంకీ, రిబ్బన్‌ కట్‌ చేసి లగ్జీరియస్ డుకాటి ఇండియా షోరూమ్‌ను ప్రారంభించారు. తర్వాత జ్యోతి ప్రజ్వలన చేశారు. ఇక చైతు.. ఫోర్ న్యూ స్క్రాంబ్లర్‌ మోడల్స్‌లో స్క్రాంబ్లర్‌ ఐకాన్‌, డెసర్ట్‌ స్లెడ్‌, ఫుల్‌ థ్రోటెల్‌, కేఫ్‌ రేసర్‌ లాంచ్ చేసాడు. మామా అల్లుళ్లు కాసేపు షోరూంలోనే గడిపి సందడి చేశారు. వీరిద్దరినీ చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తులో షోరూం వద్దకు చేరుకున్నారు. ఇక ఈ రియల్‌ లైఫ్‌ మామా-అల్లుళ్లు రీల్‌ లైఫ్‌లో కూడా మామా –అల్లుళ్లుగా కనిపించనున్నారు. తాజాగా.. వెంకటేష్, నాగ చైతన్య కలిసి వెంకీమామ సినిమాలో నటిస్తున్నారు.