ఏపీ ఎన్నికల ఫలితాలు మే23 కి సాధ్యమేనా!!!

SMTV Desk 2019-04-26 18:39:33  ap elections 2019, elections result

అమరావతి: ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలను మే 23న విడుదల చేస్తామని ఎన్నికల సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సాంకేతిక సమస్యలతో కొన్న చోట్ల పోలింగ్ అపహాస్యం పాలవుతోంది. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తున్నారని, ఈసీ కొన్ని పార్టీలపై కక్షతో వ్యవహరిస్తోందని, ఎన్నికల ఫలితాలు పారదర్శకంగా ఉండేందుకు 50 శాతం వీవీప్యాట్లలోని రసీదులను కూడా లెక్కించాలని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అలా చేస్తే ఫలితాలు ఆరేడు రోజులు ఆలస్యం అవుతాయని ఈసీ చెప్పింది. చివరికి ఒక్కో నియోజకవర్గంలో 5 వీవీప్యాట్లను ర్యాండమ్‌గా ఎంచుకుని లెక్కించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో 175 నియోజవక వర్గాలున్న ఏపీలో ఒక్కో స్థానంలో 5 వీవీప్యాట్లను లెక్కించాల్సి ఉండడం వల్ల ఫలితాలు మే 23న అర్ధరాత్రి వరకు కొనసాగుతాయని, పూర్తి ఫలితాలు రావాలంటే మే 24వ తేదీ తెల్లవారుజాము వరకు వేచి చూడాల్సి వస్తుందని కొందరు నేతల చెబుతున్నారు. మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి. మామూలుగా అయితే ఫలితాలు కౌంటింగ్ రోజున సాయంత్రం కల్లా వస్తుంటాయి. వీవీప్యాట్ల లెక్కింపు ప్రక్రియ సుదీర్ఘం అవుతుందని, రసీదుల లెక్కింపులో రిటర్నింగ్ అధికారులు, పరిశీలకులకు మాత్రమే పాల్గొనాల్సి ఉంటుంది. వీవీప్యాట్ల రసీదులను ఈవీఎంల ఓట్లతో సరిపోల్చిన తర్వాతే ఫలితాలు విడుదల చేస్తారు. దీనికి ఆరేడు గంటల సమయం పడుతుందని చెబుతున్నారు. అయితే ఫలితాలు ఆలస్యం కాకుండా ఈసీ ఉదయం నుంచి వీవీప్యాట్లను కూడా లెక్కిస్తుందని, సాయంత్రానికిల్లా పూర్తి ఫలితాలు వచ్చేస్తాయని మరికొందరు అధికారులు చెబుతున్నారు. దీనిపై ఎన్నికల సంఘం స్పష్టం ఇవ్వకపోవడతో.. ఫలితాలు మే 24 అంటూ మీడియాలో వార్తలు వెల్లువెత్తుతున్నాయి.