రోడ్డు ప్రమాదాల భారీన ఎక్కువగా గురవుతున్నది..?

SMTV Desk 2017-06-02 18:23:36  America,scientist,16-17 years boys met an road accidents

వాషింగ్టన్, జూన్ 2 : నేటి రోజులలో ప్రతి ఒక్కరి ఇంటిలో వాహనాలు ఉండటం సర్వసాధారణం అయ్యింది. అంతే కాకుండా తల్లిదండ్రుల వాహనాలను పిల్లలు నడపడానికి ఆసక్తి చూపడంతో, తల్లిదండ్రులు కూడా వాహనాన్ని అడగ్గానే ఇవ్వటం వల్ల చిన్నారులు తమ ఇష్టానుసారం వాహనాన్ని నడుపుతున్నారు. అలా నడిపించడం వల్ల చాలా ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని అమెరికా పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. 18 ఏళ్ల వయస్సున్న వారితో పోల్చుకుంటే 16-17 సంవత్సరాల యువకులు ప్రమాదాలకు ఎక్కువగా గురయ్యే ముప్పు 3.9 రెట్లు ఎక్కువగా ఉందని తమ అధ్యయనంలో రుజువైందని వారు చెప్పారు. 30-59 ఏళ్ల వయస్సు ఉన్న వారితో పోల్చితే.. ఈ ముప్పు 4.5 రెట్లు ఎక్కువగా ఉందని తెలిపారు. ఈ ప్రమాదాలకు ముఖ్యమైన కారణాలు ఏమిటంటే డ్రైవింగ్ నుంచి దృష్టి మళ్లడం, సీట్ బెల్ట్ ధరించకపోవడం, మితిమీరిన వేగంతో వెళ్ళడం, స్మార్ట్ ఫోన్ పట్టుకుని డ్రైవింగ్ చేయడం అని వివరించారు.