ఆడి పాడి చిందులేసిన అజయ్‌ దేవగణ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, టబు.

SMTV Desk 2019-04-26 17:18:24  rakul preet singh

అందాల భామ రకుల్ ప్రీత్‌సింగ్‌ తో సమానంగా టాలీవుడ్‌ సీనియర్‌ నటి టబు డాన్స్‌ చేశారు. బాలీవుడ్‌ టాప్ హీరోల్లో ఒకరైన అజయ్‌దేవ్‌గన్‌ సరసన ‘దే దే ప్యార్‌ దే’ సినిమాలో రకుల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో టబూ మరో కథనాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి గతంలో రెండు పాటలను చిత్ర బృందం విడుదల చేసిన సంగతి తెలిసిందే. వడ్డీ షరాబాన్‌ అనే ఆ పాటలో రకుల్‌ మందుసీసా చేతిలో పట్టుకుని దాన్ని తాగుతూ.. పంజాబీ స్టైల్‌లో చిందులేస్తూ కనిపించింది. ఈ పాట రకుల్‌ అభిమానులను బాగా అలరించింది. అయితే తాజాగా సినిమా నుంచి మరో పాటను రిలీజ్‌ చేసింది సినిమా యూనిట్‌.


‘హౌలీ హౌలీ..’ అంటూ తెగ చిందులేస్తున్నారు అజయ్‌ దేవగణ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, టబు. ఓ పార్టీలో రకుల్‌, టబు..అజయ్‌తో కలిసి స్టెప్పులేయడం ఆకట్టుకుంటోంది. టీ సిరీస్‌ సంస్థ నిర్మాణంలో ..అకీవ్‌ అలీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అజయ్‌దేవ్‌గన్‌ ప్రియురాలిగా రకుల్‌ నటిస్తుండగా.. ఆయన మాజీ భార్యగా టబు నటిస్తున్నారు. అన్ని వర్గాలు వారు చూడగలిగే రొమాంటిక్‌ కామెడీ చిత్రంగా ఈ సినిమాను తెరకెక్కించారు. మే 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.