మోదీ మెగా రోడ్ షో

SMTV Desk 2019-04-26 16:08:14  indian pm, pm modi, narendra modi, narendra modi road shoe in varanasi

వారణాసి: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వారణాసిలో నామినేషన్ వేయనున్న నేపథ్యంలో గురువారం అక్కడ భారీ రోడ్‌షోను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో పాటుగా పలువురు పార్టీ సీనియర్ నేతలు కూడా పాల్గొన్నారు. బనారస్ హిందూ యూనివర్శిటీ ఆవరణ వ్యవస్థాపకుడు మదన్ మోహన్ మాలవీయ విగ్రహానికి ముందుగా పూలమాల వేసిన తర్వాత ప్రధాని ర్యాలీని ప్రాంభించారు. బనారస్ విశ్వవిద్యాలయంనుంచి దశాశ్వమేథ్ ఘాట్‌దాకా సుమారు ఏడు కిలోమీటర్ల మేర సాగిన ఈ రోడ్‌షోలు బారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొడంతో అనేక చోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాషాయ దుస్తులు ధరించిన రోడ్ షోలో పాల్గొన్న ప్రధానికి దారి పొడవునా పార్టీ అభిమానులు మోడీ.. మోడీ అంటే నినాదాలతో స్వాగతం పలికారు. దశాశ్వమేథ్ ఘాట్ వద్ద సాయంత్రం జరిగిన గంగా ఆరతిలో ప్రధాని పాల్గొన్నారు. వారణాసి చేరుకోవడానికి ముందు ప్రధాని ‘దర్భంగా, బందాలో భారీ బహిరంగ సభల్లో పాల్గొన్న తర్వాత నాకెంతో ఇష్టమైన కాశీ చేరుకున్నా. లక్షలాది మంది సోదర సోదరీమణులను కలుసుకోవడానికి ఇదొక సదవకాశం.. హరహర మహదేవ్’ అంటూ ట్వీట్ చేశారు. కాగా శుక్రవారం మధ్యాహ్నం 11.30 గంటల సమయంలో ప్రధాని తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరేతో పాటుగా బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, పలువురు బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు కూడా పాల్గొంటారని పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. అంతకు ముందు ప్రధాని బిజెపి బూత్ అధ్యక్షులు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతారు. ఆ తర్వాత కాలభైరవ ఆలయాన్ని సందర్శిస్తారు.