హీరో కార్తికేయ గుణ 369 ఫస్ట్ లుక్

SMTV Desk 2019-04-26 16:06:32  Guna 369 , Karthikeya,

ఆరెక్స్ 100 సినిమాతో యూత్ ఆడియెన్స్ కు దగ్గరైన హీరో కార్తికేయ. ఆ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. సినిమాలో పాయల్ అందాల విందుతో పాటుగా కార్తికేయ నటన సినిమాకు ప్రాణం పోసింది. ఇక ఆ సినిమా హిట్ తో తెలుగు తమిళ భాషల్లో హిప్పి సినిమా చేస్తున్నాడు కార్తికేయ. అది సెట్స్ మీద ఉండగానే మరో సినిమా కూడా మొదలు పెట్టాడు. అర్జున్ జంద్యాల డైరక్షన్ లో కార్తికేయ హీరోగా వస్తున్న సినిమా గుణ 369.

ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఆరెక్స్ 100 లానే ఇది కూడా రియల్ ఇన్సిడెంట్స్ తో ఏర్పరచుకున్న కథ అని తెలుస్తుంది. ఫస్ట్ లుక్ లో కార్తికేయ కండలు తిరిగే దేహంతో వీపు భాగమే అయినా అదిరిపోయింది. హిప్పిలో రొమాంటిక్ గాయ్ గా కనిపిస్తున్న కార్తికేయ గుణ 369 లో మాస్ హీరోగా కనిపిస్తాడని చెప్పొచ్చు. తిరుమల్ రెడ్డి, అనీల్ కడియాల నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంప్రెస్ చేసింది.