గవర్నమెంట్ టీచర్ల నెల జీతం 3 లక్షలు!

SMTV Desk 2019-04-26 15:50:25  uae government, uae govt hiring teachers for they govt schools

యూఏఈ: యూఏఈ ప్రభుత్వం తమ దేశంలోని సర్కార్ బడుల్లో పాటాలు చెప్పేందుకు దాదాపు 3,000 మంది టీచర్లను నియమించుకుంటోంది. అయితే వీరికి ఆ సర్కార్ నెలకు అక్షరాల రూ.3,04,017 జీతం ఇచ్చేందుకు సిద్దమయ్యింది. ముంబై, ఢిల్లీలో నియామక ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. టీచర్ల ఎంపికకు రాత పరీక్ష, ఇంటర్వ్యూలు ఉంటాయి. ఎంపికకైన అభ్యర్థులకు నెలకు రూ.3,04,017 జీతం లభించనుంది. భారత్‌లో టీచర్ల వేతనాల సగటుతో పోలిస్తే ఈ జీతం దాదాపు 10 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. యూఏఈ ప్రభుత్వం అక్కడికి వెళ్లే వారికి మరిన్ని సదుపాయాలు కల్పించేందుకు సిద్ధమౌతోంది. ఎంపికైన అభ్యర్థుల కుటుంబాల కోసం కొత్త వీసా నిబంధనలను కూడా తీసుకురావాలని చూస్తోంది. యూఏఈలో ప్రైవేట్ స్కూళ్లతో గవర్నమెంట్ స్కూళ్లు ఏమాత్రం పోటీపడలేకపోతున్నాయి. అందుకే అక్కడి ప్రభుత్వం పరిస్థితులను చక్కదిద్దేందుకు తగిన చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే కొత్తగా టీచర్లను నియమించుకుంటోంది.