తెలుగు రాష్ట్రాలకు తుఫాను హెచ్చరికలు!

SMTV Desk 2019-04-26 15:06:36  tsunami, fani tsunami, andhrapradesh, telangana

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాలకు తుఫాను సంభవించే అవకశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని వాతావరణ శాఖా అధికారులు హెచ్చరించారు. బంగాళా ఖాతం, హిందూ మహాసముద్రం మధ్య ఈ నెల 26వ తేదీన ఏర్పడే అల్పపీడనం తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. శ్రీలంకు ఆగ్నేయంగా హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి 36 గంటల్లో వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇది వాయువ్య దిశగా తమిళ నాడు వైపు ప్రయాణిస్తుందన్నారు. అనంతరం 48 గంటల వ్యవధిలో తుపానుగా మారుతుందని తెలిపారు. ఈ సీజనులో ఏర్పడుతోన్న తొలి తుపాను కాగా, దీనికి ‘ఫణి అని నామకరణం చేశారు. ఈ తుపాను ప్రభావం తమిళనాడు, పుదుచ్ఛేరి రాష్ట్రాలపై తీవ్రంగా ఉంటుందని అంచనా వేశారు.