మీ ముఖం గులాబీల అందాలు విరజిమ్మాలంటే ...

SMTV Desk 2019-04-26 15:00:36  face glow tips

ముఖం గులాబీలా అందంగా విరజిమ్మాలంటే కింద చెప్పిన విధంగా చేస్తే సరిపోతోంది.
1. పాలల్లో బ్రెడ్ ముక్కలు నానేసి ముఖానికి రాసుకొని పది నిమిషాలు తర్వాత కడిగెయ్యాలి.
2. కొబ్బరినూనె ,ఆలివ్ ,ఆయిల్ ,నిమ్మరసం... మూడు కలిపి ముఖానికి రాసుకొని 15 నిముషాల తరువాత శెనగపిండితో కానీ నలుగుపిండితో కానీ రుద్దుకోవాలి.
3. అలుగడ్డలు తొక్కుతీసి మెత్తగా ఉడికించి పాలతోగాని ,పుల్లపెరుగుతోగానీ ,కలిపి ముఖానికి రాసుకుంటే పట్టిలాగా తయారవుతుంది. 15 నిమిషాల తరువాత పట్టి తీసెయ్యాలి . ముడతలు ,మచ్చలుపోయి చర్మం శుభ్రంగా ఉంటుంది .
4. రోజూ చిటికెడు పసుపు ,మీగడతో కలిపి రాసుకొని స్నానం చేయాలి . స్నానానికి అరగంట ముందే రాసుకోవాలి .
5. కోడిగుడ్డు తెల్లసొనతో ఆలివ్ ఆయిల్ ను కలిపి ముఖానికి పట్టి వేసి ఆరాక ,గోరువెచ్చని నీళ్ళల్లో దూది ముంచి ఆ పట్టిని నెమ్మదిగా తీసివేయ్యలి . ముఖం నున్నగా ఉంటుంది .
6. కొత్తసున్నం , మంచి ఆ ఘాటైన పసుపు కలిపి రాస్తే పులిపిర్లు రాలిపోతాయి . ఆ తరువాత మచ్చ పోవడానికి తేనె +నిమ్మరసం రాయాలి .
7. కొత్తిమీర ,పొదీనా మెత్తగా నూరి రాస్తే నల్లమచ్చలు పోతాయి .
8. తేనె ,నిమ్మరసం కలిపి రాస్తే ఆటలమ్మ మచ్చలు ,గుంటలు పోతాయి .
9. ఆటలమ్మ మచ్చలను ప్లాస్టిక్ సర్జరీతో పోగొట్టుకోవచ్చు కానీ అంత ఖర్చుపెట్టలేని నాళ్ళు నిమ్మరసం ,బార్లీపిండి ,మినప్పిండి కలిపి రాస్తే మచ్చలు ,గుంటలు పోతాయి .