రాహుల్ విమానంలో సాంకేతిక సమస్య.. తప్పిన పెను ప్రమాదం

SMTV Desk 2019-04-26 12:55:49  rahul gandhi

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. వెంటనే అప్రమత్తమైన పైలెట్లు విమానాన్ని మల్లి ఢిల్లీకి తరలించారు. దీంతో రాహుల్ గాంధీకి పెను ప్రమాదం తప్పింది. దీంతో ఆయన ఈరోజు ప్రచారానికి ఆలస్యంగా హాజరుకానున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో పాట్నాకు బయల్దేరారు.

కాగా, మార్గమధ్యలోనే రాహుల్ ప్రయాణిస్తున్న విమానం ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఆయన వెల్లడించారు. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా బీహార్‌లోని సమస్తిపూర్, ఒడిశాలోని బాలాసోర్, మహారాష్ట్రలోని సంగంనేర్‌లో జరగాల్సిన సభలకు కొంచెం ఆలస్యంగా హాజరవుతానని ట్వీట్ చేస్తూ విమానానికి సంబందించిన వీడియోను కూడా పోస్ట్ చేశారు. అలాగే అసౌకర్యానికి కార్యకర్తలకు క్షమాపణలు కూడా చెప్పారు.